
కనులు కనులు కలిస్తె ఈ పగలే గడచిపోతుంది తనువు తనువు కలిస్తె ఈ రేయే గడచిపోతుంది మనసు మనసు కలిస్తె ఈ జీవితమే గడచిపొతుంది
నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి